ఇకపై అలాంటి పాత్రలు చేయను.. కట్టప్ప షాకింగ్ కామెంట్స్!

by Hamsa |
ఇకపై అలాంటి పాత్రలు చేయను.. కట్టప్ప షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: స్టార్ నటుడు సత్యరాజ్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో ‘బాహుబలి’ మూవీలో కట్టప్ప పాత్రలో నటించి ఊహించని విధంగా వరల్డ్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకుని ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయనను కట్టప్ప అనే పేరుతోనే పిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రజెంట్ సత్యరాజ్ ‘జీబ్రా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. ఇందులో సత్యరాజ్ పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘‘విలన్ పాత్రలతోనే నా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేశాను. మిర్చి సినిమాతో తెలుగులో ఓ మంచి తండ్రిగా ఫేమస్ అయ్యాను. కానీ ఆ తర్వాత బాహుబలిలో కట్టప్పగా నటించాను. ఇలాంటి పాత్రలు మళ్లీ చేసే అవకాశం రావడం చాలా అరుదు. మిర్చీ మూవీతోనే తెలుగులో నాకు ఇమేజ్ వచ్చింది. ఇకనుంచి రెగ్యులర్ విలన్ పాత్రలు చేయను. హీరో ముందు తలొగ్గి ఉండే పాత్రల్లో కూడా కనిపించను’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ సత్యరాజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న వారు షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed