మీనాను పెళ్లి చేసుకుని జీవితం ఇస్తా.. నెట్టింట సంచలనం సృష్టిస్తున్న సినీ క్రిటిక్ వ్యాఖ్యలు

by Hamsa |   ( Updated:2024-03-22 08:10:00.0  )
మీనాను పెళ్లి చేసుకుని జీవితం ఇస్తా.. నెట్టింట సంచలనం సృష్టిస్తున్న సినీ క్రిటిక్ వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: సినీ క్రిటిక్ సంతోష్ వర్కీ పలు సినిమాలకు రివ్యూలు ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా నిత్యం పలు వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలిచాడు. అయితే గతంలో సంతోష్ వర్కీ నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నానంటూ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనూ సంతోష్ తనను 6 ఏళ్లుగా వేధిస్తున్నాడని నిత్యామీనన్ తెలపడంతో అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతను నిత్యామీనన్‌కు క్షమాపణలు చెప్పాడు.

అంతటితో ఆగకుండా పలువురు నటీనటులపై పలు కామెంట్లతో అతను నిత్యం వివాదాలు ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, సంతోష్ వర్కీ హీరోయిన్ మీనాను పెళ్లి చేసుకుంటానని అని కామెంట్స్ చేయడంతో అవి నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ‘‘ భర్తను కోల్పోయిన మీనాకు జీవితాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీనాకు కూతురు ఉన్నా పర్లేదు పెళ్లి చేసుకుంటాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సంతోష్ వర్కీ కామెంట్స్ వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన మీనా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫేమస్ కావడానికి ఇంతలా దిగజారుతావా? అంటూ ఫైర్ అవుతున్నారు.

Read More..

రాజమౌళి కంటే ఆయన భార్య ఎన్ని సంవత్సరాలు పెద్దదో తెలిస్తే షాక్

Advertisement

Next Story