‘బ్రో’ సినిమా ఇంకా 10 భాషల్లో చేస్తాను.. నెక్ట్స్ వచ్చేది ఆ భాషలోనే: Samuthirakani

by sudharani |   ( Updated:2023-08-01 10:10:30.0  )
‘బ్రో’ సినిమా ఇంకా 10 భాషల్లో చేస్తాను.. నెక్ట్స్ వచ్చేది ఆ భాషలోనే: Samuthirakani
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘బ్రో’. సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. జూలై-28న రిలీజై మిక్సిడ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షనల్లో మాత్రం సునామి సృష్టించింది. ఈ క్రమంలోనే సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది టీమ్. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘బ్రో’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నేను 12 భాషల్లో తీయాలి అనుకున్నా. ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో చేశాను. ఇంకా 10 భాషల్లో తీయాల్సి ఉంది. అంతే కాకుండా.. ప్రతి భాషలోను అక్కడి స్టార్స్‌తో.. అక్కడి బడ్జెట్‌కి తగ్గట్టుగానే తీస్తాను’’ అని చెప్పుకొచ్చారు.

Read More : ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లు అన్నీ వేస్ట్.. మీకు టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: RGV

Advertisement

Next Story

Most Viewed