ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.. కానీ నన్నే ఎందుకు టార్గెట్ చేశారు: ప్రియమణి

by sudharani |   ( Updated:2024-10-05 14:30:42.0  )
ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.. కానీ నన్నే ఎందుకు టార్గెట్ చేశారు: ప్రియమణి
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది ప్రియమణి. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గేదేలే అన్నట్లుగా ‘జవాన్, మైదాన్, ఆర్టికల్ 370, భామాకలాపం 2’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. 2022లో రిలీజైన ‘భామాకలాపం’కు సీక్వెల్‌గా వచ్చిన ‘భామ కలాపం 2’ ఈ ఏడాది ఫిబ్రవరి 16 న వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తన ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘ముస్తాఫా రాజ్‌వి, నావి అభిప్రామాలు, ఇష్టాలు కలవడంతో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాం. అయితే 2016లో మా నిశ్చితార్థం అయింది. అప్పటి నుంచి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాను. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని తప్పుడబుతూ పలువురు నన్ను ట్రోల్స్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ట్రోల్స్‌ను నేను పట్టించుకోనప్పటికీ.. ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తోంది. కులమతాలకతీతంగా పెళ్లి చేసుకున్న స్టార్లు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. కానీ, ఈ విషయంలో నన్నే ఎక్కువగా విమర్శించారు. ప్రేమ అనేది రెండు మనసులకు సంబంధించిన విషయం. ఆర్థికస్థిరత్వం, ప్రాంతం, భాష ఇలాంటి వ్యత్యాసాలు ప్రేమకు ఉండవు’ అంటూ చెప్పుకొచ్చింది.


Advertisement

Next Story

Most Viewed