- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Avika Gore: అతనితో నాకు ఎప్పుడో పెళ్లైపోయింది..అవికా గోర్ షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా: చిన్నారి పెళ్లి కూతురు సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ అవికా గోర్. ఈ అమ్మడు ఉయ్యాల జంపాల మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో అమ్మడుకి మంచి గుర్తింపు లభించడంతో పాటుగా ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. దీంతో తెలుగుతో పాటుగా హిందీలోనూ పలు మూవీస్ చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ తన ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘బ్లడీ ఇష్క్’ మూవీలో నటిస్తుంది. ఈ సినిమా జూలై 26న విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న అవికా గోర్ తనకు పెళ్లి జరిగిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ మిలింద్ చాద్వాని నాకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఫస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నాము. కానీ ఒకరోజు అతను నాకు ప్రపోజ్ చేశాడు. మా ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో నేను కూడా ఒప్పుకున్నాను. అతను చాలా మంచివాడు నా దృష్టిలో మిలింద్‌కు నాకు మానసికంగా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది.
అయితే వివాహం అనేది పెద్ద విషయం కాబట్టి చాలా సార్లు చర్చించుకున్నాం. వయసును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాము. కాబట్టి ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాక చేసుకుంటాం’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ అమ్మడు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.
- Tags
- Avika Gore