‘బేబీ’ సినిమాకు ప్రేక్షకుల రియాక్షన్ చూసి.. థూ నా బతుకు అంటూ ట్వీట్ చేసిన బేబీ డైరెక్టర్

by Hamsa |   ( Updated:2023-08-07 09:15:16.0  )
‘బేబీ’ సినిమాకు ప్రేక్షకుల రియాక్షన్ చూసి.. థూ నా బతుకు అంటూ ట్వీట్ చేసిన బేబీ డైరెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. దీనిని డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించారు. ఈ సినిమా జూలై 14 విడుదలై భారీ కలెక్షన్స్‌లో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో చిత్ర బృందం పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సాయి రాజేష్ శ్రీకాకుళంలోని ఓ థియేటర్లో ప్రేక్షకులతో పాటు సినిమాని చూశారు.

ఇలా థియేటర్ లో సినిమాను వీక్షించిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ‘‘ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు హర్ష వచ్చి హీరోకి ఆ అమ్మాయి గురించి నిజం చెబుతాడు. అయితే ఆ సమయంలో ప్రేక్షకులు ఫీల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఎలాంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లేకుండా మ్యూట్ చేశాము. కానీ, ఈ సన్నివేశంలో హీరో బాధను అర్థం చేసుకుండారని అలా చేస్త థియేటర్‌లో మాత్రం ప్రేక్షకులు ఆ బాధను ఫీల్ కాకుండా హ్యాపీ బర్త్ డే ఆనంద్ అంటూ గట్టిగా అరిచారు. థూ నా బతుకు’’ అంటూ రాసుకొచ్చాడు. అయితే ఈ ట్వీట్ చేసిన కొంత సమయానికి సాయి రాజేష్ దీనిని డిలీట్ చేశారు.



Advertisement

Next Story

Most Viewed