- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నా జీవితం అంతకు ముందులా మారితే బాగుండు'.. Samantha Emotional
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చేతిలో వరుస చిత్రాలు ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా సామ్ అనారోగ్య సమస్యతో, పూర్తిస్థాయిలో షూటింగ్ మానేసి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా చాలా కాలం తర్వాత తన సోషల్ మీడియా వేదిక ద్వారా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది సమంత. ఇందులో భాగంగానే సమంత, తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పుకొచ్చింది.
అలా ఓ అభిమాని 'సమంత జీవితం ఎలా ఉంది?' అంటూ ప్రశ్నించారు.. ఇందుకు సమంత ఎవరూ ఊహించిన విధంగా సమాధానం ఇచ్చింది. 'ప్రస్తుతం నా జీవితం గతంలో మాదిరిగా కాకుండా మరోలా ఉంది. ఊహించిన విధంగా నా జీవితంలో అన్నింటినీ ఎదుర్కొంటున్నాను. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అది మీరు నాపై చూపించే అభిమానం. నా పరిస్థితి అర్థం చేసుకుని నా తోడున్నారు. నా కోసం ప్రార్థిస్తున్నారు. ఇందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరందరూ ఇలా చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది సమంత. అయితే 'నా జీవితం ఇంతకు ముందులా లేదు, యధాస్థితికి ఎప్పుడు వస్తుందో' అని సామ్ చెప్పిన ఆన్సర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి : నా సత్తా ఏంటో ఆయనకు బాగా తెలుసు.. అందుకే డైరెక్ట్ పిలిచాడు