వారానికి ఒకసారైనా ఆ పని చేసేవాడిని.. కానీ నా కొడుకు పుట్టాక మానేశాను.. హీరో నిఖిల్ ఆసక్తికర కామెంట్స్

by Hamsa |
వారానికి ఒకసారైనా ఆ పని చేసేవాడిని.. కానీ నా కొడుకు పుట్టాక మానేశాను.. హీరో నిఖిల్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ డాక్టర్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన భార్య ప్రెగ్నెంట్ అంటూ శుభవార్త చెప్పి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు. ఫిబ్రవరి 21న పల్లవి ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కానీ బాబు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా, నిఖిల్ తన కొడుకు పేరు రివీల్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘నా కొడుకుకు ధీర సిద్ధార్థ అని పేరు పెట్టాము. అయితే పిల్లలు చాలా త్వరగా పెరుగుతారు కాబట్టి నేను ప్రతిరోజూ అతనితో సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నాను.

పల్లవితో బాధ్యతలు పంచుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేను కనీసం వారానికి ఒక్కసారైనా పార్టీకి వెళ్లే వాడిని, కానీ ఇప్పుడు ఆ పని చేయడం మానేశాను. మీరు తల్లితండ్రులుగా మారిన తర్వాత చెడు అలవాట్లను విడిచిపెట్టి మంచిగా మారాల్సిందే. పిల్లలకు మంచి మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్నింటి దూరంకాక తప్పదు. 15 సంవత్సరాల క్రితం ఎవరైనా నా జీవితం ఇంత మంచిగా మారుతుందని చెబితే, నేను ఒత్తిడిని తగ్గించుకుని సంతోషంగా ఉండేవాడిని’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ‘స్వయంభు’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీనిని డైరెక్టర్ కృష్ణమాచారి తెరకెక్కిస్తుండగా.. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల నభా స్వయంభు షూటింగ్‌లో జాయిన్ అయినట్లు ఓ వీడియోను షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది.

Advertisement

Next Story