ఆ కోరికతో నిద్రలేని రాత్రులు గడిపా.. చివరికి అతనితో చెప్పుకున్నాను: Surekhavani

by Hamsa |   ( Updated:2024-03-13 07:42:33.0  )
ఆ కోరికతో నిద్రలేని రాత్రులు గడిపా.. చివరికి అతనితో చెప్పుకున్నాను: Surekhavani
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి సురేఖావాణి పిన్నిగా, అత్తగా, తల్లిగా భార్యగా, ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి తన పాపులారిటీ పెంచుకుంది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఆమె గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైంది. తన కూతురిలో వెకేషపన్స్‌కు వెళ్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా అప్పడప్పుడు సోషల్ మీడియాలో పలు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే సురేఖావాణి ఏం చేసినా నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. ఆమెకు సంబంధించిన వార్తలు సైతం వైరల్ అవుతుంటాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ నా భర్త చనిపోక ముందు నన్నెంతో గౌరవించేవారు. నేను కూడా అతన్ని బాగా చూసుకున్నాను. కానీ సడెన్‌గా ఆయనకు అనారోగ్యం బాగాలేకపోవడం వల్ల హాస్పిటల్‌లో చేర్పించాల్సి వచ్చింది. దీంతో నేను అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ మా అత్తింటి వారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. వాటిని పట్టించుకోకుండా నా భర్త ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్నాను. కానీ నా భర్త ప్రాణాలు కోల్పోవడంతో నాకు దూరమయ్యాడు. దీంతో ఆయనను తలుచుకొని ఏడుస్తూ ఉండేదాన్ని. అంతేకాకుండా నిద్రలేని రాత్రులు గడిపాను.

ఈ క్రమంలోనే దేవుడిని ఒక రోజు, ఒక గంట నా భర్తలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండని పదే పదే కోరుకునేదాన్ని. కనీసం కలలో అయినా కనపడితే ఆయనతో మాట్లాడి పలు విషయాల గురించి అడిగి తెలుసుకోవాలనుకున్నాను. క్షమాపణలు చెప్పాలనుకున్నా కానీ అతను కలలో కూడా కనిపించలేదు. కొన్ని రోజులపాటు ఆయన కనిపించాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. అయినప్పటికీ నా భర్తతో చాలా చెప్పుకున్నాను. అతను నా మాట వింటాడని భావించాను. అలాగే అతడిని గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడే నేను డిప్రేషన్‌లోకి వెళ్లిపోయా నా కూతురే నాకు తోడుగా ఉండి ఈ బాధ నుంచి బయటపడేలా చేసింది’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed