ఆ హీరో నుంచి చాలా నేర్చుకున్నా: Varsha Bollamma

by Vinod kumar |   ( Updated:2022-12-04 12:57:31.0  )
ఆ హీరో నుంచి చాలా నేర్చుకున్నా: Varsha Bollamma
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఈమధ్య బాగా వినిపిస్తున్న పేరు వర్ష బొల్లమ్మ. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్‌గా ఓ ఇంటర్వూలో పాల్గొన్న వర్ష హీరో విజయ్ సేతుపతి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. 'విజయ్‌ సేతుపతిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంత గొప్ప ఇమేజ్‌ ఉన్న నటుడు, పెద్ద స్టార్‌ సామాన్యంగా ఎలా ఉంటారు? '96' సినిమా కోసం విజయ్‌ సేతుపతితో పది రోజులు వర్క్‌ చేశా. అప్పుడే నా క్యారెక్టర్‌ అయిపోయిందా ఇంకొన్ని రోజులు షూటింగ్‌ ఉంటే బాగుండేది అనిపించింది. ఇదంతా విజయ్‌ సేతుపతి వల్లే. అలన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నా. ఓసారి షూటింగ్‌ అయిపోయింది. విజయ్‌ సర్‌ కారవ్యాన్‌లోకి వెళ్తుంటే అభిమానులు గుంపుగా వచ్చారు. వాళ్లందరితో మాట్లాడుతూ రెండు గంటల పాటు ఫొటోలకు పోజులిచ్చాడు. షూటింగ్‌లో ఎంత అలసిపోయినా ఆ అలసట ఆయన మొహం మీదకి రానివ్వలేదు. నాకు అప్పుడు తెలిసొచ్చింది విజయ్‌ సేతుపతి అంటే ఏమిటో' అంటూ పొగిడేసింది.

Advertisement

Next Story