Deepika Padukone : దీపికా లవ్ ఎఫైర్లు అన్నీ నాకు తెలుసు: రణ్‌ వీర్ సింగ్!

by Anjali |   ( Updated:2023-08-01 08:40:26.0  )
Deepika Padukone : దీపికా లవ్ ఎఫైర్లు అన్నీ నాకు తెలుసు: రణ్‌ వీర్ సింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ ఒకరు. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉండి వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా దీపికా-రణ్‌వీర్ ఎవరి సినిమాల్లో వారు బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం రణ్ వీర్ ‘రాణీ ఔర్ రామ్ కీ ప్రేమ్ కహానీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన దీపిక గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘‘గతంలో దీపికకు ఉన్న లవ్ స్టోరీస్ నాకు చెప్పింది. తను నాతో చాలా ఓపెన్‌గా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు. నిజమైన ప్రేమలో దాపరికాలు ఉండొద్దనేదే మా ఇద్దరి అభిప్రాయం. నేను కూడా దీపికతో అన్ని విషయాలు పంచుకుంటాను.’’ అంటూ రణ్ వీర్ సింగ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ హారో చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Read More : మళ్లీ రెచ్చిపోయిన దీపిక.. ప్రైవేట్ పార్ట్‌ షోపై రణ్‌వీర్ వార్నింగ్

Advertisement

Next Story

Most Viewed