అనారోగ్యం విషయంలో Samantha కంటే ఎక్కువ నరకం చూశాను:Sri Sudha

by Anjali |   ( Updated:2023-09-12 14:33:02.0  )
అనారోగ్యం విషయంలో Samantha కంటే ఎక్కువ నరకం చూశాను:Sri Sudha
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి శ్రీ సుధ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో సుధ క్యారెక్టర్ చాలా బోల్డ్‌గా ఉంటుంది. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. ‘సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశాలు లేకుండా చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ వివాదం వల్ల కొన్ని సినిమాలు మిస్ అయ్యాను. వచ్చే అవకాశాలు వస్తునే ఉన్నాయి. కెరీర్ కావాలంటే డబ్బులు మాత్రమే కాదు.. గుర్తింపునిచ్చే సీన్లు కూడా ఉండాలి. క్యాస్టింగ్ కౌచ్‌కు నేను వ్యతిరేకం.

ఈ విషయంపై శ్యామ్ కె నాయుడు ఇంటి దగ్గర ఎన్నిసార్లు గొడవలు చేశానో నాకే తెలుసు. ఇక మా బాబుకు కూడా మొత్తం తెలుసు. వాడి పాపాన వాడే పోతాడు అనేవాడు. మా బాపు ఇప్పుడు బీటెక్ చదుతున్నాడు. ఇంకా చెప్పాలంటే సమంత కంటే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా. ఈ వ్యాధుల వల్ల నరకం చూస్తున్నా. వాష్ రూమ్ పక్కనే ఉన్నా.. బెడ్ దిగి వెళ్లడానికి నాకు కనీసం రెండు గంటలు పడుతుంది. ఇప్పుడు మీతో ఇలా మాట్లాడినందుకు రేపు మొత్తం రెస్ట్‌లోనే ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది సుధ.

ఇవి కూడా చదవండి : Krishnam Rju మొదటి వర్ధంతి సందర్భంగా Anushka ఎమోషనల్ పోస్ట్

Advertisement

Next Story