- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు ఎప్పుడో పెళ్లి జరిగింది తమన్నా షాకింగ్ కామెంట్స్..!!
దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా తన అందం నటనతో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఇటీవల బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, తమన్నా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, దానిపై తమన్నా, విజయ్ స్పందించలేదు.
తాజాగా, తమన్నా ఓ ఇంటర్య్వూలో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘‘మేమిద్దరం కలిసి ఒక సినిమా చేసాము. అంతమాత్రానికే మా మధ్య ఏదో ఉందని పుకార్లు బాగా సృష్టించారు. ఇలాంటి అనవసర విషయాల గురించి నేను అసలు పట్టించుకోను. అయితే దానిపై ఇంకా స్పష్టతనివ్వాల్సిన అవసరమూ లేదు. హీరోయిన్ల విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. అంతేకాదు నిజంగానే మాకు నిజమైన పెళ్లి కావడానికి ముందే ఎన్నోసార్లు పెళ్లి చేసేస్తుంటారు. వైద్యుల నుంచి వ్యాపారవేత్తలు దాకా అందరితోనూ మాకు వివాహం జరిపిస్తుంటారు. అవన్నీ చదువుతుంటే ఒక్కోసారిగా నాకు కూడా ఎప్పుడో పెళ్లయిపోయిందేమో అని అనుమానం కలుగుతుంది. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకున్నా కూడా అది పుకారే అని జనం నమ్మరేమో’’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : పెళ్లి పీటలెక్కబోతున్న సమంత.. వరుడు ఆ హీరోనేనా?