- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మా నాన్న చనిపోవడం నాకు సంతోషంగా అనిపించింది.. జబర్ధస్త్ కమెడియన్
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై అత్యంత ప్రాధాన్యం దక్కించుకున్న షోల్లో జబర్ధస్త్ ఒకటి. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ షో చాలా మంది కమెడియన్లకు మంచి జీవితాన్ని అందించింది. అందులో లేడీ కమెడియన్ పాగల్ పవిత్ర ఒకరు. గత కొంత కాలంగా జబర్ధస్త్‌లో చేస్తున్న పవిత్ర ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కాగా.. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన పవిత్ర తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది. పాగల్ పవిత్ర మాట్లాడుతూ..
''తను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. తన తండ్రి లారీ డ్రైవర్‌గా, తల్లి వ్యవసాయ కూలీగా చేసేవారట. తండ్రి బాగా మద్యానికి బానిస కావడంతో బంధువుల సహాయంతో తాను ఇంటర్ వరకు చదువుకున్నట్లు తెలిపింది. అంతే కాకుండా కుటుంబానికి బారం కాకూడదని హైదరాబాద్ వచ్చి సెలూన్ పెట్టిందట. ఈ క్రమంలోనే తనకు జబర్ధస్త్‌లో ఛాన్స్ వచ్చిందని చెప్పింది. కాగా.. సెలూన్‌లో లాభాలు రాకపోయే సరికి అది అమ్మేసి తన సొంత ఊరిలో ఇల్లు కొనుక్కుందట. తండ్రి మీద కోపంతో 13 ఏళ్లు మాట్లడలేదని.. ఆయన ముఖం చూడటానికి కూడా ఇష్టపడేదాన్ని కాదని తెలిపింది. తండ్రి గత ఏడాది క్రితం చనిపోయారు. ఆ విషయం తెలిసి నేను చాలా సంతోషపడ్డాను'' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.