నాకు ఇష్టం లేకున్న ఆ హీరో కోసమే స్విమ్ సూట్ వేసుకున్న.. అలనాటి స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
నాకు ఇష్టం లేకున్న ఆ హీరో కోసమే స్విమ్ సూట్ వేసుకున్న.. అలనాటి స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బెంగుళూరుకు చెందిన విద్యాసాగర్ అనే సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడింది. కాగా వీరికి నైనిక అనే కూతురు కూడా పుట్టింది. కానీ కొన్ని నెలల క్రితం మీనా భర్త విజయ సాగర్ అనారోగ్యం కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే. ఇకపోతే మీనా సెకెండ్ ఇన్నింగ్స్‌లోను అదరగొడుతుంది. మంచి మంచి క్యారెక్టర్స్‌తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా స్విమ్ సూట్ వేసుకోవడం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. స్విమ్ సూట్స్ వేసి గ్లామరస్ రోల్స్‌లో నటించాలని ప్రభుదేవా సూచించారని తెలిపింది. ఆయన హీరోగా వచ్చిన ఓ మూవీలో స్విమ్ సూట్ వేసుకోవాల్సి రావడంతో చాలా ఇబ్బంది అనిపించింది. డ్రెస్ వేసుకుని మేకప్ రూమ్ నుంచి రావడానికి సిగ్గేసింది. కానీ అయిష్టంగానే దాన్ని వేసుకున్నాని మీనా గుర్తు చేసుకున్నారు. గ్లామరస్ రోల్స్ చేయడం చాలా కష్టమని.. ఆ టైప్ క్యారెక్టర్లు చేసేవాళ్లకు దండాలంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మీనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story