చిరంజీవి మాటలకు కన్నీళ్లు ఆపులేకపోయాను.. ‘హనుమాన్’ డైరెక్టర్ పోస్ట్ వైరల్

by sudharani |
చిరంజీవి మాటలకు కన్నీళ్లు ఆపులేకపోయాను.. ‘హనుమాన్’ డైరెక్టర్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: యంగ్ అండ్ డైనమిక్ హీరో తేజా సజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. ‘ఓ బేబీ’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు. తర్వాత ‘జాంబీ రెడ్డి, ఇష్క్, అద్భుతం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన తేజా.. ‘హనుమాన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

దీంతో హీరో తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. నెట్టింట విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి మొదటి నుంచి సపోర్ట్‌గా ఉన్న మెగా స్టార్ చిరంజీవి.. ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొని మూవీ టీంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా మరోసారి ‘హనుమాన్’ సినిమాపై, హీరో తేజా సజ్జాపై ఆశక్తికర కామెంట్స్ చేశారు.

చిరు మాట్లాడుతూ.. ‘అక్కడ కూర్చున్న వ్యక్తి 25 ఏళ్ల క్రితం బాలనటుడిగా నా సినిమాల్లో నటించాడు. చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ పెరిగాడు. నన్ను స్పూర్తిగా తీసుకుని ఎదిగాడు. ఇటీవల హనుమాన్ సినిమాతో దేశప్రజల అభిమానాన్ని గెలుచుకున్నాడు. హనుమాన్ పై సినిమా చేయాలని చాలా కాలంగా అనుకున్నాను. కానీ కుదరలేదు. కానీ అతడు చేశాడు. నేను పూర్తిగా సంతృప్తి చెందాను. అతను నా ప్రయాణంలో భాగమే’ అంటూ తేజాను ఆకాశానికి ఎత్తేశాడు చిరంజీవి. దీంతో తేజా పైకి లేచి మరి ఆనందంతో క్లాప్స్ కొట్టాడు. అయితే.. ఇందుకు సంబందించిన వీడియోను షేర్ చేస్తూ.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ పోస్ట్ పెట్టాడు.

‘నేను నటించాలనే కలల చిత్రం ‘హనుమాన్’.. అనే మాటలు పద్మవిభూషణ్ చిరంజీవి నోటి వేంట విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మాటలు నా భుజాలపై మరింత బాధ్యతను పెంచాయి. అలాగే మైటీ మెగా నుండి ఈ మాటలను నేను ఎప్పటికీ గౌరవిస్తాను. ఈ వీడియో చూసి కన్నీళ్లను అదుపు చేసుకోలేకపోయాను!’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story