- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను పోగొట్టుకున్న బంగారంతో ఒక ఇల్లు కట్టుకోవచ్చు... నిహారిక ఆసక్తికర కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారికు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట యాంకర్‌గా బుల్లితెరకు పరిచయం అయింది. తన మాట తీరుతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అయితే నిహారిక పలు సినిమాలలో నటించిన ప్రేక్షకుల మాత్రం ఈమెను ఆదరించలేకపోవడంతో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో నాగబాబు జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి చేశాడు. వీరిద్దరూ కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్‌సిరీస్, సినిమాలు తెరకెక్కించే పనిలో పడింది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. నిహారికను మీరు ఫస్ట్ టైం ఎప్పుడు మేకప్ వేసుకున్నారు అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి మెగా డాటర్.. నేను ఢీ షో కే మొదటి మేకప్ వేసుకున్నానని తెలిపింది. ఈ షో నాకు ఎప్పటికీ మెమొరబుల్. ఆ తర్వాత.. మీరు చిన్నప్పుడు ఏవైనా విలువైన ఖరీదైన వస్తువులను పోగొట్టుకొని బాధపడిన సందర్భాలు ఉన్నాయా అని అనడంతో.. పోగొట్టుకోవడమా ఆ విషయంలో నేను ముందుంటాను. చిన్నప్పుడు అమ్మ నాకోసం ఎన్నో రకాల డిజైన్స్ నగలను తెచ్చి పెట్టేది. నేను వాటిని చాలా ఎక్కువగా పోగొట్టుకున్నాను. చిన్నప్పుడు చాలా బంగారం పోగొట్టుకున్నాను.. నేను పోగొట్టుకున్న బంగారంతో ఒక ఇల్లు కట్టుకోవచ్చు. అప్పుడు నాకు పెద్దగా తెలిసేది కాదని అసలు నేను పెట్టుకున్న నగలు ఉన్నాయో లేదో కూడా గమనించుకునే దానిని కాదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన వారు ఆశ్చర్యపోతున్నారు.