- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయాల్సింది పోయి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.. నటి ఎమోషనల్ కామెంట్స్!
దిశ, సినిమా: నటి అవంతిక వందనపు టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం మూవీలో నటించి మెప్పించింది. ఆ తర్వాత మనమంతా, ప్రేమమ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇటీవల ఈ అమ్మడు మీన్ గర్ల్స్ సినిమాతో తన పాపులారిటీ పెంచుకుంది. అంతేకాకుండా ఆమె డ్రెస్సింగ్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. గ్లామర్ డోస్ పెంచి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలో అవంతిక డ్రెస్సింగ్, మాట్లాడే విధానంపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవంతిక తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ మా అమ్మానాన్నలది తెలంగాణ. కానీ నేను అమెరికాలో పుట్టి పెరిగాను నాకు పదేళ్లు ఉన్న సమయంలో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మూవీ ఆఫర్స్ రావడంతో ఇక్కడే ఉండిపోయాము. నా కోసం అమ్మ జాబ్ వదిలేసి నాతో పాటు షూటింగ్స్‌కు వస్తుంది. అయితే నేను అమెరికా ఆక్సెంట్‌లో మాట్లాడుతున్నానని నన్ను ట్రోల్స్ చేస్తున్నారు.
అంత దారుణంగా ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను అమెరికాలో పుట్టి పెరిగాను. కాబట్టి నా మాట, యాస అక్కడిలాగే వస్తుంది. దానికి ట్రోల్స్ చేయడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయాల్సింది పోయి ట్రోల్స్ చేయడం నేను ఇప్పటివరకు చూడలేదు. అమెరికాలో నెపోటిజం అసలు ఉండదు. తెలుగు హీరోయిన్‌గా రాణించాలని నా కోరిక. స్టార్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More..