Tamanna: నాకు అతనితో ప్రతీ శుక్రవారం పెళ్లి చేస్తున్నారు : తమన్నా

by Prasanna |   ( Updated:2023-03-13 06:20:52.0  )
Tamanna: నాకు అతనితో ప్రతీ శుక్రవారం పెళ్లి చేస్తున్నారు : తమన్నా
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్‌ వర్మతో కొంతకాలంగా రిలేషన్‌ షిప్‌‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా గోవా‌లో జరిగిన ఓ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకుంటూ కనిపించారు. అప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. కాగా తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. ‘నేను, విజయ్‌ వర్మ కలిసి ఒక సినిమా చేశాం. అప్పటి నుంచి మాపై రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంతకు మించి నేనేమీ చెప్పను. మా సినిమా‌లకు సంబంధించిన రూమర్స్ కంటే మా రిలేషన్‌షిప్‌, పెళ్లిళ్లపైనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. నిజంగా నాకు పెళ్లి జరిగే సమయానికి, ప్రేక్షకులే చాలా పెళ్లిళ్లు చేసేలా ఉన్నారు. డాక్టర్‌, బిజినెస్‌మెన్‌ అంటూ ప్రతీ శుక్రవారం ఎవరో ఒకరితో నా పెళ్లి చేస్తున్నారు’ అంటూ సెటైరికల్‌గా మాట్లాడింది తమన్నా. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more:

భర్త చనిపోయిన తర్వాత.. మొదటి‌సారి తాను ప్రేమించిన హీరో పేరు రివీల్ చేసిన మీనా!

నాకు ఎప్పుడో పెళ్లి జరిగింది తమన్నా షాకింగ్ కామెంట్స్..!

Advertisement

Next Story