- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఎంజాయ్ చేస్తా మీకేంట్రా నొప్పి నెటిజన్లపై మంచు లక్ష్మి ఫైర్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మికి పరిచయం అక్కర్లేదు. పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుంది. అంతేకాకుండా తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారికి తనదైన స్టైల్లో గట్టి సమాధానం చేప్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, మరోసారి మంచు లక్ష్మి ఇలాంటి విషయంలో స్పందించింది. ఇటీవల ఆమె విమానం ఎక్కేందుకు వెళ్లినప్పుడు కార్పెట్ అపరిశుభ్రంగా ఉందని ఎయిర్ పోర్ట్ వారికి ఒక ట్వీట్ చేసింది. దానికి వారు విచారం వ్యక్తం చేశారు. కానీ నెటిజన్లు మాత్రం ఆమెపై దారుణమైన కామెంట్లు చేశారు. దీంతో మంచు లక్ష్మి స్పందించింది.
ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో కార్పెట్ శుభ్రంగా వీడియో పెట్టాను. నా ఐపోన్‌తో తీసిన ఫొటో వల్ల ఇంకా బాగా కనపడుతోందనుకున్నాను. అంతే వరుసగా చాలా మంది కామెంట్లు చేశారు. వారందరూ ఎలాంటి కామెంట్లు చేశారంటే.. ఓహో నువ్వు బిజినెస్ క్లాస్‌లో వెళ్తున్నావా? నీకు ఐఫోన్ ఉందా’ అని అన్నారు. ‘‘ ఇవన్నీ నాకు నువ్వు కొనిచ్చావా? నా కష్టం.. నా సంపాదన.. నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? నేను ఐఫోన్ వాడటం తప్పు అన్నట్లు మాట్టాడుతురేంటిరా.. నాకు సొంతంగా విమానం కావాలి? మీకు వద్దా?పెద్దగా ఆలోచించరా? మీకు అన్నీ తప్పులే కనపడుతున్నాయి. నువ్వేదో నాకు డబ్బులు కట్టేట్టు. ఒక సగటు మహిళ ఏమీ చెప్పకూడదు. ఏమీ చేయకూడదు. సోషల్ మీడియాలో ఏది పోస్ట్ పెట్టకూడదు. అసలు మీ సమస్య ఏంటి? డబ్బు సంపాదించడానికి నేను చాలా కష్టపడతా.
మాకు ఎవరూ ఉచితంగా డబ్బులు ఇవ్వరు. చివరకు మా అమ్మానాన్నలు కూడా నాకు డబ్బులు ఇవ్వరు. వారు మాకు కష్టపడటం మాత్రమే చిన్నప్పటి నుంచి నేర్పించారు. డబ్బు ఉంటే సంతోషంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నేను వాళ్ళతో నేను ఏకీభవించను. నా జీవితంలో ఎంతో డబ్బును చూశా. నేను వజ్రాలు పొదిగిన బంగారు స్పూన్ ఉన్న ఇంట్లో పుట్టి పెరిగా. కానీ అమెరికాలో ఉన్నప్పుడు రోజూ తినే తిండి కోసం కూడా కష్టపడి పని చేశా. డబ్బు మనకు స్వేచ్ఛను మాత్రమే ఇస్తుంది. డబ్బు ఉంటే పేరు ప్రతిష్ట వస్తుందని భావించకండి. మనం ప్రతి దానికి తప్పు పట్టకూడదు. జీవితం చాలా చిన్నది. వేరే వాళ్ల కోసం బతికే బతుకు ఒక బతుకేనా? ఇతరుల అభిప్రాయాలను గౌరవించు వాటిని ఎత్తి చూపుతూ, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు’’ అంటూ చెప్పుకొచ్చిన వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.
Money for me buys me freedom not happiness! https://t.co/5BTXDPXNNM pic.twitter.com/5lZcqyEHrt
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 22, 2023