RR vs KKR : ముగిసిన రాజస్థాన్ ఇన్నింగ్స్... కోల్‌కతా టార్గెట్ 152

by M.Rajitha |
RR vs KKR : ముగిసిన రాజస్థాన్ ఇన్నింగ్స్... కోల్‌కతా టార్గెట్ 152
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్(RR vs KKR) మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. గువాహటి(Guwahati)లోని బర్సపారా క్రికెట్ స్టేడియం(Barsapara Cricket Stadium)లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ లో టాస్ ఓడి రాజస్థాన్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. జురేల్ 33, జైస్వాల్ 29, పరాగ్ 25 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్, అలీ, వరుణ్, హర్షిత్ తలా రెండు వికెట్లు తీయగా.. జాన్సన్ ఒక వికెట్ తీశాడు. మరికాసేపట్లో కోల్‌కతా తన ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

Next Story