పబ్లిక్ ఫిగర్‌నే కానీ.. పబ్లిక్ ప్రాపర్టీ మాత్రం కాదంటున్న ఉర్ఫీ.. ఏం జరిగిందంటే..

by samatah |   ( Updated:2023-07-22 06:39:11.0  )
పబ్లిక్ ఫిగర్‌నే కానీ.. పబ్లిక్ ప్రాపర్టీ మాత్రం కాదంటున్న ఉర్ఫీ.. ఏం జరిగిందంటే..
X

దిశ, సినిమా: ఉర్ఫీ జావెద్ అంటే తెలియని సోషల్ మీడియా యూజర్లు ఉండరు. తరచూ న్యూ మోడల్ డ్రెస్సింగ్స్‌తో హాట్‌ హాట్‌గా ఫోజులిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ విధమైన లుక్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఉర్ఫీ. ఇక తాజాగా ఓ వెకేషన్ కోసం ముంబై నుంచి గోవాకు విమానంలో వెళ్తున్న తనను మద్యం మత్తులో ఓ వ్యక్తి టీజ్ చేసిన విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంది ఉర్ఫీ. ‘నిన్న ఫ్లైట్‌లో గోవాకు వెళ్తుండగా జర్నీలో ఈవ్ టీజింగ్‌కు గురయ్యాను. ఒకతను నన్ను వేధించడం మొదలు పెడితే కోపం వచ్చి నేనూ వాదించా. అతను మద్యం మత్తులో అలా మాట్లాడుతున్నాడని, అతని ఫ్రెండ్స్ చెప్పారు. కానీ ఎంత తాగి ఉన్నప్పటికీ ఇలా ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని క్షమించలేం. నేను పబ్లిక్ ఫిగర్ నే కానీ.. పబ్లిక్ ప్రాపర్టీ మాత్రం కాదు కదా’ అంటూ చెప్పుకొచ్చింది ఉర్ఫీ.

Read more : Movie News & Gossips

https://www.instagram.com/stories/urf7i/3151821179618333287/?igshid=MTc4MmM1YmI2Ng==

Advertisement

Next Story