నేను అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానిని: MS Dhoni wife Sakshi Dhoni

by Anjali |   ( Updated:2023-07-24 15:05:19.0  )
నేను అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానిని: MS Dhoni wife Sakshi Dhoni
X

దిశ, వెబ్‌డెస్క్: ధోని ఎంటెర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ ‘మహేంద్ర సింగ్’.. భార్య సాక్షి.. నిర్మిస్తోన్న తమిళ సినిమా ఎల్‌జీఎమ్ ఆగస్టు 4వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కల్యాణ్ హీరోగా, ఇవానా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్. ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానరర్స్ రిలీడ్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ధోని భార్య హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘సాధార‌ణంగా ధోని ఎప్పుడూ స‌ర్‌ప్రైజ్‌లిస్తుంటారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన మ‌రో స‌ర్ప్రైజ్ ఇది. క్రికెట్ అంటే అందరూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనుకుంటారు. కానీ, మా వారికి అది ప్రొఫెష‌న్‌. క్రికెట్ ఎలాగో సినిమా కూడా ఎంట‌ర్‌టైన్మెంట్ కాబ‌ట్టి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాం. ఇద్ద‌రం చాలా సినిమాలు చూస్తాం. ముఖ్యంగా తెలుగులో అయితే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సినిమాలు నేను చూస్తాను. నేను బన్నీకి పెద్ద అభిమానిని. ఆయన నటించిన అన్ని మూవీస్ చూశాను.’’ అంటూ సాక్షి చెప్పుకొచ్చారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సాక్షిపై పాజిటివ్‌గా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read More : Sitara , అల్లు అర్జున్‌‌కు ఎంత పెద్ద ఫ్యానో.. బన్నీ కోసం ఏం చేసిందంటే?

Advertisement

Next Story