నేను కూడా ఆ స్టార్ హీరో బ్యాచ్‌లో చేరాలనుకుంటున్నా.. పూనమ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Hamsa |   ( Updated:2023-10-27 08:11:57.0  )
నేను కూడా ఆ స్టార్ హీరో బ్యాచ్‌లో చేరాలనుకుంటున్నా.. పూనమ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీ లీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఇటీవల థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

ఇప్పటికే ఈ మూవీపై చాలా మంది ప్రశంసలు కురిపించారు. తాజాగా, హీరోయిన్ పూనమ్ కౌర్ ‘భగవంత్ కేసరి’ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘‘ భగవంత్ కేసరి చూసినందుకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. ఈ సినిమా చూశాక నేను కూడా జై జై బాలయ్య బ్యాచ్‌లో చేరాలనుకుంటున్నాను’’ అని రాసుకొచ్చింది. దీంతో అది చూసిన బాలయ్య ఫ్యాన్స్ థాంక్యూ చెబుతున్నారు. ప్రస్తుతం పూనమ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story