అనసూయతో రిలేషన్‌పై ఓపెన్ అయిన హైపర్ ఆది.. ఆమె కూడా ఎంజాయ్ చేసిందంటూ..

by Javid Pasha |   ( Updated:2024-04-20 14:20:53.0  )
అనసూయతో రిలేషన్‌పై ఓపెన్ అయిన హైపర్ ఆది.. ఆమె కూడా ఎంజాయ్ చేసిందంటూ..
X

దిశ, సినిమా : స్మాల్ ‌స్క్రీన్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ అనే కామెడీ ప్రోగ్రామ్‌లో ఎంట్రీ తర్వాతనే ఇతను మస్తు ఫేమస్ అయిండు. తన పంచ్ డైలాగులతో టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆది అదే లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. కొంతకాలం క్రితమే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్‌కు దూరమైనప్పటికీ ప్రజెంట్ టెలివిజన్ షోలలో హయ్యెస్ట్ పెయిడ్ కమెడియన్‌గా ఉన్నాడు. ఓ వైపు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలు చేస్తూనే మరోవైపు మూవీ ఆఫర్స్ కూడా అందుకుంటున్నాడు.

ఇటీవల హైపర్ ఆది పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో స్టార్ క్యాంపెయినర్‌గానూ ప్రచారంలో పాల్గొంటూ బిజీ అయిపోయాడు. ఇదిలా ఉండగా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది తన కెరీర్, జబర్దస్త్ ప్రోగ్రామ్, ప్రముఖ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌తో ఉన్న రిలేషన్‌పై ఓపెన్ అవుతూ.. అనేక విషయాలు పంచుకున్నాడు. ‘‘జబర్దస్త్‌లోకి రాకముందు నేను జాబ్ చేసేవాడిని. అప్పటికే నా ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయింది. నాకేమో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. మొత్తానికి ఉన్న మూడెకరాల పొలం అమ్మేసి అప్పులు తీర్చేశాం. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యా’’ అని తెలిపిన ఆది. అనసూయతో తన అనుబంధం గురించి కూడా వెల్లడించాడు. ‘‘అనసూయతో నాకు మంచి రాపో ఉంది. అందుకే ఆమెతో స్కిట్ చేసేవాడిని. ఆమె కూడా నేను చేసే ప్రతీ స్కిట్‌ని ఎంజాయ్ చేసేది. నన్ను బాగా అర్థం చేసుకునేది. కావాల్సిన రియాక్షన్ ఇచ్చేది’’ అంటూ చెప్పుకొచ్చాడు ఆది. ప్రస్తుతం ఈ డైలాగులు నెట్టించ చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Read More...

ఆసియాతో నాకు గొడవలు అవుతున్నాయి.. బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ నూకరాజు !

Advertisement

Next Story