Tiragabadara saami : రాజ్ తరుణ్ తిరగబడర సామీ మూవీ ఎలా ఉందంటే..?

by Prasanna |
Tiragabadara saami : రాజ్ తరుణ్ తిరగబడర సామీ మూవీ ఎలా ఉందంటే..?
X

దిశ, సినిమా: గత కొద్దీ రోజుల నుంచి హీరో రాజ్ తరుణ్ వివాదాల మధ్య చాలా నలిగిపోయాడు. సినిమాలు రిలీజ్ లు ఉన్నా సరే ప్రమోషన్స్ కి కూడా అటెండ్ అవ్వలేదు. ఇక హీరోగా ఈ మధ్య సరయిన హిట్ సినిమాలే లేవు. వ్యక్తిగత జీవితంలో కేసులు అంటూ రాజ్ తరుణ్ పేరు మారు మోగిపోతుంది. తాజాగా రాజ్ తరుణ్ నటించిన తిరగబడర సామీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతో హిట్ అందుకున్నాడో ? లేదో ఇక్కడ చూద్దాం..

ఫస్ట్ హాఫ్ మొత్తం సో సో గా కొనసాగింది. ఎమోషన్ అయితే ఎక్కడా కనిపించలేదు. సెకండాఫ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది. విలన్ గ్యాంగ్‌లోని కామెడీ సీన్లు కూడా యావరేజ్ గా ఉన్నాయి. అక్కడక్కడే సీన్లు చూపించి.. అదే కామెడీ అని భావిస్తే ఎలా అంటూ నెటిజెన్స్ నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీలో యావరేజ్.

ఇక సినిమాలో నటించిన పాత్రలు గురించి మాట్లాడుకుంటే.. రాజ్ తరుణ్ కి ఇలాంటి కథ ఎలా నచ్చిదంటూ ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక హీరోయిన్ మాల్వీ మల్హోత్ర గురించి చెప్పాలంటే మొత్తం ఓవర్ యాక్షన్‌లా ఉంది. ఈ టైటిల్ చూసాక ఆడియెన్స్ తిరబడుతున్నారు. ఇలాంటి కథలను మళ్ళీ తీయకంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.

Advertisement

Next Story