నిజంగా ఇదొక అద్భుతం.. 'ఆర్ఆర్ఆర్'కు ఫిదా అయ్యాను!

by Harish |   ( Updated:2023-02-13 09:24:55.0  )
నిజంగా ఇదొక అద్భుతం.. ఆర్ఆర్ఆర్కు ఫిదా అయ్యాను!
X

దిశ, సినిమా: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. గతంలోనూ ఓ సారి 'ఆర్ఆర్ఆర్'ను పొగడ్తలతో ముంచేసిన ఆయన.. తాజాగా ఈ మూవీ చూసినపుడు తనకు కలిగిన అనుభూతి గురించి వివరించాడు. 'ఆర్ఆర్ఆర్' చూసి నిజంగా ఆశ్చర్యపోయా. ఇదొక అద్భుతం. గ్రాఫిక్స్ మాత్రమే కాదు కథలో ఉన్న ప్రతి క్యారెక్టర్‌కు నేను ఫిదా అయ్యా. ఈ స్టోరీ చెప్పడంలో రాజమౌళి షేక్‌స్పియర్‌ను తలపించాడు. ఎన్‌టీ‌ఆర్, రామ్ చరణ్ రోల్స్ మరో లెవల్‌లో ఉన్నాయి. వీటన్నింటి గురించి రాజమౌళితో వివరంగా మాట్లాడాలనుకున్నా. కానీ, అతన్ని కలిసే టైమ్ దొరకలేదు. అందుకే డిటెయిల్‌గా చర్చించలేకపోతున్నా. త్వరలోనే ఈ చిత్రం గురించి దర్శకుడితో డిస్కస్ చేయాలనుకుంటున్నా' అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి: ఇలియానాపై పదేళ్ల నిషేధం.. అలా చేయడమే కారణమా?

అది ఎంత దుర్మార్గం.. అతని గురించి తలచుకుంటే ఏడుపొస్తుంది: కంగన



Advertisement

Next Story