పెళ్లైన స్టార్ డైరెక్టర్‌‌తో హీరోయిన్ పెళ్లి పోస్ట్ వైరల్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చారుగా?

by Hamsa |
పెళ్లైన స్టార్ డైరెక్టర్‌‌తో హీరోయిన్ పెళ్లి పోస్ట్ వైరల్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చారుగా?
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకుంటూ సినిమాలకు దూరం అవుతున్నారు. అలాగే కొంతమంది మాత్రం సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని కొద్ది రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. కానీ కొద్దిమంది సెలబ్రిటీలు ఊహించని విధంగా అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. తాజాగా, ఓ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ కార్తీక్‌తో హీరోయిన్ బ్రిగిడ సాగా పెళ్లి దుస్తుల్లో కనిపించారు.

ఈ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక అది చూసిన వారంతా నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారని అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. విఘ్నేష్ బ్రిగిడ కలిసి ఓ సినిమా షూటింగ్ కోసం మాత్రమే అలా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు.

అయితే ఇది వరకే విఘ్నేష్‌కు పెళ్లైంది. ఇక బ్రిగిడ విషయానికొస్తే తమిళ ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో.. ఈ పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో ఫ్యాన్స్ కంగారు పడిపోయారు. కానీ అసలు విషయం తెలుసుకున్నాక కాస్త కుదుట పడ్డారు. ప్రస్తుతం విఘ్నేష్, బ్రిగిడ పెళ్లి గెటప్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

(Video Link Credits to Vignesh Karthik Instagram Channel)



Next Story

Most Viewed