తనతో తానే పోటీ పడుతున్న హీరోయిన్..

by sudharani |   ( Updated:2024-09-12 14:53:28.0  )
తనతో తానే పోటీ పడుతున్న హీరోయిన్..
X

దిశ, సినిమా: సినీ కెరీర్‌ ప్రారంభించి 20 వసంతాలు పూర్తిచేసుకున్న వన్నె తరగని గ్లామర్‌ త్రిష సొంతం. ఇప్పటికి టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఈ అందాలభామ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాదు యువతలో కూడా ఇప్పటికీ ఆమె క్రేజ్‌ అలాగే ఉంది. ప్రస్తుతం తెలుగులో త్రిష, మెగాస్టార్‌ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష క్యారెక్టర్‌ ఎంతో వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నాయి యూనిట్‌ వర్గాలు. కాగా ఈ సినిమాతో పాటు ఆమె తమిళంలో అజిత్‌కు జోడిగా ఓ చిత్రంలో నటిస్తున్నారు.

విదాముయార్చి పేరుతో రూపొందనున్న ఈ మూవీలో కూడా త్రిష పాత్ర ఆసక్తికరంగా ఉంటుందట. అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఒకేసారి 2025 సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. సాధారణంగా తెలుగులో సంక్రాంతి పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. అగ్రహీరోల మధ్య సంక్రాంతి పోరు ప్రతి ఏడాది సర్వసాధారణమే. అయితే ఈసారి జనవరి 12న చిరంజీవి విశ్వంభరతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అజిత్‌ నటించిన విదాముయార్చి చిత్రం కూడా విడుదల కానుంది. సో.. ఈ సంక్రాంతికి హీరోల మధ్య పోటీయే కాదు. త్రిష కూడా తనతో తానే పోటిపడుతుంది. ఈ పోటి ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది.

Advertisement

Next Story