ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ శ్రీలీల.. బయటపడ్డ బాయ్ ఫ్రెండ్ ఫుల్ డిటేల్స్!

by sudharani |
ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ శ్రీలీల.. బయటపడ్డ బాయ్ ఫ్రెండ్ ఫుల్ డిటేల్స్!
X

దిశ, సినిమా: ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి స్టార్ ఢమ్‌ను సొంతం చేసుకుంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. బాలకృష్ణ, మహేశ్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక శ్రీలీల తన యాక్టింగ్, అందం, డాన్స్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంది. మొన్నటివరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో సైలెంట్ అయిపోయింది. వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో.. గతంలో అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు తప్ప ప్రస్తుతానికి మరో సినిమా ప్రకటించలేదు.

మూవీస్ చెయ్యనప్పటికీ తన చదువు పూర్తి చేసే పనిలో పడింది ఈ యంగ్ బ్యూటీ. త్వరలోనే MBBS పూర్తి చేసి అందరితో డాక్టరమ్మ అని పిలుపించుకోవాలని చూస్తుంది. దీంతో పాటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనుకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ప్రేక్షకులతో పంచుకుంటోంది. అంతే కాకుండా.. నెట్టింట అందాల ప్రదర్శనతో కుర్రకారును ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. శ్రీలీలకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది.

కన్నడ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు.. ప్రస్తుతం శ్రీలీల షూటింగ్స్ లేకపోవడంతో తన బాయ్ ఫ్రెండ్‌తో షికారులు చేస్తుందట. బయటకు తిరుగుతూ, పార్టీలకి వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తుందట. అంతే కాకుండా.. శ్రీలీల బాయ్ ఫ్రెండ్ కూడా తనతో పాటు డాక్టర్ చదువుతున్నాడని సమాచారం. ఇక అతను ఓ బడా పొలిటికల్ లీడర్ మనవడని, వేల కోట్లకు ఏకైక వారసుడని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే.. వైరల్ అవున్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed