- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లుక్కు మారింది గురూ.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన జూనియర్ ఐశ్వర్యరాయ్

దిశ, సినిమా: ఒకప్పుడు వెండితెరపై ఉర్రూతలూగించిన నటి ఆమె. ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించే ఈ బ్యూటీ పేరు చెప్పగానే సినీ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ నటించిన సింహా లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా? జూనియర్ ఐశ్వర్యరాయ్‌గా ఫేమ్ సంపాదించుకున్న స్నేహ ఉల్లాల్.
టాలీవుడ్‌లోని పలు చిత్రాల్లో మెరిసి అలరించినా ఎందుకో కానీ ఈ నీలికళ్ల చిన్నది అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత నటనకు దూరమైన ఈ బ్యూటీ ఇన్నాళ్లు ఎక్కడుందో, ఏం చేస్తున్నదో పెద్దగా తెలియకుండా పోయింది. కానీ సడెన్‌గా ఆమె తెలుగు నటి తేజస్వి మదివాడతో కలిసి ఓ రెస్టారెంట్‌లో దర్శనమిచ్చింది. ప్రజెంట్ ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ 36 ఏళ్ల నీలికళ్ల హీరోయిన్ ఎలా ఉండేది, ఎలా మారిపోయింది అంటూ కొందరు, ‘లుక్కు మారింది గరూ’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈమె ఇప్పటికీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టని స్నేహ ఉల్లాల్ మరోసారి వెండితెరపై మెరిసే ఆలోచనలో ఉందేమోనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Read More...
కరెంట్ సినిమాలోని హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?