టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో హీరోయిన్ పెళ్లి.. క్లారిటీ ఇదే!

by Hamsa |   ( Updated:2024-07-18 11:06:05.0  )
టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో హీరోయిన్ పెళ్లి.. క్లారిటీ ఇదే!
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో పెళ్లి రూమర్స్ రావడం బాగా ఎక్కువైపోయింది. క్రికెటర్లు హీరోయిన్లతో ప్రేమలో పడటం బ్రేకప్‌లు చెప్పుకోవడం కామన్ అయిపోయింది. కొందరు పెళ్లి కూడా చేసుకున్నాక మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోతున్న పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. అయితే గత కొద్ది కాలంగా టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ పలువురు హీరోయిన్లతో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన సచిన్ కూతురితో కూడా రిలేషన్‌లో ఉన్నట్లు పలు పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఆ తర్వాత ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఈ క్రమంలో..

తాజాగా, సీరియల్ హీరోయిన్‌ రిద్ధియా పండిట్‌తో శుభ్‌మన్ గిల్, పెళ్లి ఫిక్స్ అయినట్లు రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లోనే వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో.. రిద్ధిమా పెళ్లి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మా మధ్య అలాంటి బంధమే లేదు. అతడు అద్భుతమైన ఆటగాడ అని తెలుసు అంతే తప్ప శుభ్‌మన్ గిల్ గురించి పూర్తిగా నాకు తెలియదు. కానీ అతను చాలా క్యూట్ ఉన్నాడు. ఒకవేళ నేను అతడిని కలిస్తే మా పెళ్లి వార్తల గురించి చెప్తాను ఇద్దరం నవ్వుకుంటాము’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రిద్ధిమా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story