BIG SHOCK: చిరంజీవితో మెహ్రీన్ డేటింగ్.. సాయిధరమ్ తేజ్‌తో కాదు చిరుతో పెళ్లి ఫిక్స్!

by Anjali |   ( Updated:2024-07-27 06:54:20.0  )
BIG SHOCK: చిరంజీవితో మెహ్రీన్ డేటింగ్.. సాయిధరమ్ తేజ్‌తో కాదు చిరుతో పెళ్లి ఫిక్స్!
X

దిశ, సినిమా: హీరోయిన్ మెహ్రీన్ అండ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత కొన్నాళ్లుగా లవ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందించి.. నెట్టింట వచ్చేవన్నీ అవాస్తవాలు. అవన్నీ నమ్మొద్దని, సాయి ధరమ్ తేజ్-మెహ్రీన్ పెళ్లి చేసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తేజ్ పెళ్లి కనుక చేసుకుంటే మేం ప్రకటిస్తామని వెల్లడించారు.

సోషల్ మీడియాలో ఈ వార్తలు వస్తోన్న క్రమంలోనే మెహ్రీన్ గురించి మరో ఇంట్రెస్ట్ విషయం బయటపడింది. ఈ హీరోయిన్ పెళ్లి సాయిధరమ్ తేజ్‌తో కాదు.. మరో వ్యక్తితో అంటూ నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గుజరాత్ సినిమాల్లో నటుడిగా, యానిమేషన్ డైరెక్టర్‌గా, నిర్మాతగా చేస్తోన్న చింరజీవి మక్వానాతో మెహ్రీన్ గత కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉందట. మరో ఆరు నెలల్లో ఈ బ్యూటీ చిరంజీవితో మూడు ముళ్లు వేయించుకోబోతుందట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో జనాలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. పెళ్లి కొడుకు సాయిధరమ్ తేజా? లేక చిరంజీవా? అంటూ షాక్ అవుతూ కన్య్ఫూజ్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed