అది చూసి అర్ధరాత్రి గుక్కపెట్టి ఏడ్చిన హీరోయిన్.. కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు!

by Hamsa |   ( Updated:2024-05-22 11:38:16.0  )
అది చూసి అర్ధరాత్రి గుక్కపెట్టి ఏడ్చిన హీరోయిన్.. కారణం ఏంటో తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ అందరికీ సుపరిచితమే. దర్శకుడు ప్రియదర్శన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు తెలుగు, తమిళ, మలయాళంలో పలు చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో హలో, చిత్రలహరిలో తర అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అయితే కళ్యాణి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

తాజాగా, ఈ బ్యూటీ అర్థరాత్రి ఓ విషయం గుర్తు చేసుకుని గుక్క పెట్టి ఏడ్చినట్లు తెలుపుతూ ఓ ఫొటోను వదిలింది. కుక్క పాదాలను చేతిపై టాటూగా వేయించుకున్న ఫొటో షేర్ చేస్తూ.. ఇది ఎందుకు ఆరోగ్యకరమైనది కాదు.. అర్ధరాత్రి 11. 30 నిమిషాలకు ఈ విషయం గుర్తుకు వచ్చి ఏడుస్తున్నా’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా హార్ట్ సింబల్, ఏడ్చే బొమ్మలు పెట్టింది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కుక్క కోసమే అర్ధరాత్రులు కూర్చొని మరీ ఏడ్వాలా? అని అంటున్నారు.

Advertisement

Next Story