కేసు కోసం ప్రూఫ్స్ వెతుకుతోన్న హీరోయిన్

by Seetharam |   ( Updated:2022-09-26 12:50:08.0  )
కేసు కోసం ప్రూఫ్స్ వెతుకుతోన్న హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: మహేష్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'అధర్వ'. డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో.. క్రైమ్ అండ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి హీరోకి సంబంధించిన యాక్షన్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

నిత్య అనే పాత్రలో కనిపిస్తున్న సిమ్రాన్.. ఈ మూవీలో కీలకమైన రోల్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ చెప్పింది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సిమ్రాన్(నిత్య) ఒక మిస్టరీ కేసును ఛేదించడానికి ప్రూఫ్స్ వెతుకుతున్నట్లు ఇంటెన్సివ్ లుక్‌లో చాలా సీరియస్‌గా కనిపించింది. దీంతో ఈ మూవీలో థ్రిల్లింగ్స్, సస్పెన్స్ సీన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ALSO READ : 'ఊర్వశివో రాక్షసివో' 29న రాబోతున్న టీజర్..

ALSO READ : 'బ్రా'లెస్ గౌనులో పిచ్చెక్కించిన సెక్సీ బ్యూటీ.. 'పాజిటివ్ వైబ్స్ ఓన్లీ' అంటూ..

Advertisement

Next Story

Most Viewed