21 రోజుల్లో బరువు తగ్గిన హీరో.. డైట్ ప్లాన్ చెబుతూ ఆసక్తికర పోస్ట్

by Hamsa |
21 రోజుల్లో బరువు తగ్గిన హీరో.. డైట్ ప్లాన్  చెబుతూ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: హీరో మాధవన్ పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన చివరిగా నటించిన చిత్రం ‘రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్’. ఈ సినిమా కోసం నంబిగా కనిపించేందుకు పొట్ట బాగా పెంచాడు. దీంతో బరువు పెరిగి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. మళ్లీ ఇటీవల షైతాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో.. తాజాగా, తాను బరువు తగ్గడానికి ఫాలో అయిన డైట్‌ను వివరిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

అందులో ‘‘బరువు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఉపవాసం పాటించాను. ఆహారాన్ని 45-60 సార్లు ఎక్కువగా నమలి తినేవాడిని. అలాగే చివరి భోజనం సాయంత్రం 6.45 గంటలకు ముగించేది. అయితే కేవలం వండిన ఆహారం మాత్రమే తిన్నాను. కానీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత పచ్చిగా ఏమీ లేదు. రాత్రి వీలైనంత తొందరగా పడుకునేవాడిని. రాత్రి 90 నిమిషాల ముందు స్క్రీన్ సమయం ఉండదు ఫోన్, టీవీ చూడటం ఆపేశాను. ఉదయాన్నే ఎక్కువ నడవడానికే కేటాయించేవాడిని. ద్రవాలు .. చాలా ఆకు పచ్చ కూరగాయలు తీసుకోవడంతో సులభంగా జీవక్రియ చేయబడి ఆరోగ్యవంతంగా బరువు తగ్గడానికి ఉపయోగపడింది. ప్రాసెస్ చేయబడిన ఆహారం తీసుకోలేదు ఇలా నేను 21 రోజుల చేసి చివరికి బరువు తగ్గాను’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story