Sai Durga Tej: నటి శ్యామలకు మెగా హీరో హెల్ప్.. మరోసారి మంచి మనసు చాటు కున్న తేజ్

by sudharani |
Sai Durga Tej: నటి శ్యామలకు మెగా హీరో హెల్ప్.. మరోసారి మంచి మనసు చాటు కున్న తేజ్
X

దిశ, సినిమా: మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నాడు. ఇటీవల శ్యామల తన దీన స్థితిని వివరిస్తూ చాలా ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ విషయాన్ని గుర్తించుకుని మరీ మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందించాడు. తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళం అందించడమే కాకుండా.. ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ క్రమంలో ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ శ్యామలను కలిసి ఆమెకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.

అనంతరం శ్యామలతో వీడియో కాల్ మాట్లాడాడు మెగా హీరో సాయి దుర్గ తేజ్. హీరోతో మాట్లాడుతూ నటి శ్యామల ‘యాక్సిడెంట్ జరిగినప్పుడు.. మీరు బాగుండాలని, ఏమీ కాకూడదని ఆ దేవుడ్ని ప్రార్థించాను’ అని చెబుతూ కన్నీరు పెట్టుకుంది. అలాగే తేజ్ కూడా.. అన్ని విధాల అండగా ఉంటామని భరోసానిచ్చారు. అందరూ సాయం చేస్తారని, తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more...

మల్టీ టాలెంటెడ్.. నిహారికపై యంగ్ హీరో కామెంట్స్ వైరల్



Next Story