- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Pothineni: పెళ్లికి సిద్ధమైన హీరో రామ్ పోతినేని!.. వధువు ఎవరంటే?
దిశ, సినిమా: ‘దేవదాసు’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన యాక్టింగ్, డాన్స్, హ్యాండ్స్‌మ్ లుక్స్‌తో తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇతని ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు. అయితే రామ్ ఈ మధ్య ఆశించిన విజయాలకు మాత్రం రీచ్ కాలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే వచ్చిన ‘ది వారియర్’, ‘స్కంద’ వంటి సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. దీంతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో ఆగస్టులో మన ముందుకు రాబోతున్నాడు. మరి చూడాలి ఈ సారైనా తన గ్రాఫ్ ఛేంజ్ అవుతుందేమో అని.
ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో రామ్ పోతినేని పెళ్లి గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అతని వివాహం గురించి మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. హీరో రామ్ త్వరలోనే హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ బిజినెస్‌మ్యాన్ కూతురిని వివాహం చేసుకోబోతున్నాడట. ఆమె పేరు మీద ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. అలాగే రామ్ పెళ్లి ఈ ఏడాదే జరిగేలా ప్లాన్ చేస్తున్నారట. వచ్చే సెప్టెంబర్‌లో నిశ్చితార్థం జరపాలని పెద్దలు నిర్ణయించుకున్నారట. ఆ వెంటనే అంటే డిసెంబర్ నాటికి వీళ్లిద్దరి వివాహం కూడా జరిపించాలని ఫిక్స్ అయ్యారట. కాగా ఈ పెళ్లికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా రాబోతుందని టాక్. ప్రస్తుతం రామ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.