తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు: రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Satheesh |   ( Updated:2023-06-06 11:55:25.0  )
తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు: రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు కావడంతో దశాబ్ధి ఉత్సవాల పేరిట అధికార బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కన్నుల పండుగ నిర్వహిస్తోంది. అంతేకాకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున జరుపుతున్నారు.

ఇక, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెట్టడంతో రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ స్టేట్ ఏర్పాటు అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ పదేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. దశాబ్ధి వేడుకల సందర్భంగా తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు’’ అని చెర్రీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed