- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెంకయ్య నాయుడికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం నచ్చలేదు: రజినీ కాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ఉప రాష్ట్రపతి, సీనియర్ పొలిటిషియన్ వెంకయ్యనాయుడిపై స్టార్ హీరో రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజినీ కాంత్ మాట్లాడుతూ.. వెంకయ్యనాయుడికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని అన్నారు. ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చి ఒక గొప్ప నాయకుడిని రాజకీయాలకు దూరం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొప్ప నాయకుడైనా వెంకయ్యనాయుడు మరికొన్ని రోజులు కేంద్రమంత్రిగా ఉంటే బాగుండేదని తలైవా తన అభిప్రాయ వ్యక్తం చేశారు.
అయితే తాను ఉప రాష్ట్రపతిని పదవిని తక్కువ చేయడం లేదని.. కానీ ఉప రాష్ట్రపతి ఎన్నో ప్రోటోకాల్స్ ఉంటాయని అని తెలిపారు. కాగా, రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రజినీ కామెంట్స్‌తో నిజంగానే వెంకయ్యనాయుడుని ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చి రాజకీయాల నుండి తప్పించారని అనే చర్చ మొదలైంది. బీజేపీ వర్గాల్లో వెంకయ్యనాయుడి గురించి రజినీ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇక, రజినీ కాంత్ తన పొలిటికల్ ఎంట్రీపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి ఎందుకు రాలేదో తలైవా క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైన టైమ్‌లోనే కరోనా వచ్చిందని.. ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆలోచించి అడుగు వేయాలని వైద్యులు సూచించారని తెలిపారు. అందుకే తాను రాజకీయాల్లోకి రాలేదని వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు బయపడ్డానని కొందరు అన్నారని.. కానీ తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టకపోవడానికి కారణం నా ఆరోగ్యం సహరించకపోవడమేనని అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు తలైవా.