Nikhil Siddhartha Apologies: అభిమానులకు సారి చెప్పిన హీరో నిఖిల్!

by Dishaweb |   ( Updated:2023-07-05 12:52:27.0  )
Nikhil Siddhartha Apologies: అభిమానులకు సారి చెప్పిన హీరో నిఖిల్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్పై’. గ్యారీ బీహెచ్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మూవీ భారీ అంచనాలతో జూన్ 29న విడుదలైంది. మొదటి రోజు రూ.11.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫస్ట్‌డే గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఇప్పటివరకు మొత్తం రూ.25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలావుంటే తాజాగా హీరో నిఖిల్ ఇతర భాష అభిమానులకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతోంది. ‘పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కార్తికేయ 2’ సినిమాను బాగా ఆదరించారు. ఇక ఈ విధంగా ‘స్పై’ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోందని వెల్లడించాం. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఇతర భాషలలో విడుదలకు నోచుకోలేదు. ఇందుకుగాను అభిమానులను క్షమాపణలు కోరుతున్నా’ అంటూ నిఖిల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Click here for Nikhil Siddhartha Twitter లింక్



Advertisement

Next Story