చేతిలో కోడిపిల్లతో హీరో నాని సూపర్ పిక్

by Javid Pasha |   ( Updated:2023-02-28 10:21:09.0  )
చేతిలో కోడిపిల్లతో హీరో నాని సూపర్ పిక్
X

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ మూవీ వచ్చే నెల 30న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. వచ్చే నెల మొదటి వారంలో దసరా మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా దసరా మూవీ నుంచి ఓ సూపర్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేతిలో కోడిపిల్లతో పొడవాటి జుట్టు, మాసిన గడ్డంతో మాస్ లుక్ లో ఉన్న నాని ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇక శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న దసరా మూవీలో నానికి జోడీగా కీర్తి సురేశ్ నటించింది. సాయి కుమార్, సముద్రఖని, పూర్ణ, దీక్షిత్ షెట్టి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించగా.. ఇప్పటికే ఈ మూవీలోని లిరికల్ సాంగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ధరణి అనే క్యారెక్టర్ లో హీరో నాని ఈ మూవీలో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story