వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిలో చిన్న పిల్లాడిలా మారిపోయిన బాలయ్య.. ఏం చేశాడంటే?

by Jakkula Samataha |
వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిలో చిన్న పిల్లాడిలా మారిపోయిన బాలయ్య.. ఏం చేశాడంటే?
X

దిశ, సినిమా : బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎనర్జీలెవల్స్, లైఫ్‌ను ఎంజాయ్ చేయడంలో ఆయనకు మించిన వారు ఎవరూ లేరు. ఓ వైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలు తీస్తూ.. అందరితో సరదగా ఉంటారు. కొన్ని సార్లు చిన్న పిల్లోడిలా బిహేవ్ చేస్తూ.. తనదైన స్టైల్‌లో కామెడీ పండిస్తాడు. అంతే కాదండోయ్ ఈయనకు కోపం చాలా ఎక్కువ. కోపం వస్తే బిగ్గరగా అరుస్తారంట కూడా, అలాంటి బాలయ్య బాబులో కొన్ని నాటి యాంగిల్స్ కూడా ఉన్నాయి అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఈ ఫోటోలు చూస్తే నమ్మల్సిందే.

అయితే తాజాగా నటి వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యారేజ్‌కు సినీతారలు అందరూ హాజరై సందడి చేశారు. సీనియర్ నటీనటులు శోభన కుష్భూ, బాలకృష్ణ, వెంకటేష్, బాలకృష్ణ వీరందరూ వరలక్ష్మీ శరత్ కుమార్ రిసెప్షన్‌కు హజరయ్యారు.కాగా, ఈ వేడుకలో బాలయ్య చేసిన హంగామా మాలుగా లేదు. చిన్నపిల్లాడిలో మారిపోయి, ఫుల్‌ ఎంజాయ్ చేశారు. తాజాగా వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో బాలయ్య డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇక ఇది చూసిన నెటిజన్స్, బాలయ్య అల్లరి మాములుగా లేదు, అచ్చం చిన్న పిల్లాడిలా మారిపోయి బాగా ఎంజాయ్ చేశాడు. బాలకృష్ణలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ ముచ్చటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed