HEMA: అవును నేను రేవు పార్టీకి వెళ్ళాను.. నేనేమి సాంప్రదాయని కాదంటూ నటి హేమ సంచలన కామెంట్స్

by Kavitha |
HEMA: అవును నేను రేవు పార్టీకి వెళ్ళాను.. నేనేమి సాంప్రదాయని కాదంటూ నటి హేమ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ప్రముఖ టాలీవుడ్ నటి హేమ పట్టుబడినట్లు అక్కడి పోలీసులు ప్రకటించడం టాలీవుడ్‌లో దుమ్ము దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె డ్రగ్స్ సేవించిందని టెస్ట్ రిపోర్ట్‌లో కూడా పాజిటీవ్‌గా వచ్చిందంటూ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు వచ్చిన నటిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆమె బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చింది. అయితే పోలీసులు హేమను అరెస్టు చేసిన తర్వాత ఆమెపై వచ్చిన ఆరోపణలు చూసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఫ్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ.. రేవు పార్టీ పై సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “అవును నేను పార్టీకి వెళ్లాను కానీ, అది రేవు పార్టీ కాదు. నేను కేవలం శనివారం జరిగిన పార్టీలో మాత్రమే పాల్గొన్నాను. ఆదివారం ఏం జరిగింది అనేది నాకు తెలియదు. బర్త్ డే జరుపుకుంటున్న వ్యక్తి నా బ్రదర్ లాంటివాడు. అతడు పిలిస్తే వెళ్ళాను. నేను ఇంకా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదు. పాజిటివ్ వచ్చిందని ఓ మీడియా ఛానల్ ప్రచారం చేసింది. తిరిగి వాళ్ళను నేను ప్రశ్నిస్తే.. హేమ హైడ్రామా చేస్తుందని కథనాలు ప్రసారం చేశారు. అలాగే సాంప్రదాయని అంటూ ఎగతాళి చేశారు. నేను సాంప్రదాయని కాదు. నేను ఎక్కడికైనా వెళతాను. నా లైఫ్ నా ఇష్టం. అడగడానికి మీరెవరు? మీకేం హక్కు ఉంది? నేను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టే చెబుతుంది. కానీ కోర్టు వ్యవహారాలు వెంటనే తేలేవి కాదు. దానికి కొంత సమయం పడుతుంది”.. అంటూ హేమ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story