పవన్ కల్యాణ్‌పై భారీగా ట్రోల్స్.. డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్ ఇదే.. పోస్ట్ వైరల్

by Hamsa |
పవన్ కల్యాణ్‌పై భారీగా ట్రోల్స్.. డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్ ఇదే.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్స్‌లో పాల్గొనకుండా ఎన్నికలు వస్తుండటంతో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, పవన్ కల్యాణ్ ‘మహామ్యాక్స్’ అనే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌ని హైదరబాద్‌లో లాంచ్ చేశారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాకు బదులు సర్దార్ భగత్ సింగ్ అని పలికారు.

ఆ తర్వాత ఫ్యాన్స్ అరవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి నిర్మాతలు ఈ ఛానల్‌కు సహాయం చేయాలని అన్నారు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఆయన నటిస్తున్న సినిమా పేరునే మర్చిపోవడమేంటని నెటిజన్లు పవన్‌పై భారీగా ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా స్పందిచారు. ‘‘ఒరిజినల్ టైటిల్ చెప్పినా, ఇంత వైరల్ అయ్యేది కాదు. పోనీలెండి అన్నీ మన మంచికే’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed