Oscar కు నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రానికి దర్శకుడు ఆయనే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-04 12:55:22.0  )
Oscar కు నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రానికి దర్శకుడు ఆయనే!
X

దిశ, వెబ్ డెస్క్: తన సినిమాల్లో తెలుగుదనం ఒట్టిపడేలా చిత్రాలను తీసి అలరించారు కె.విశ్వనాథ్. వినసొంపైన పాటలు, చక్కని సంభాషణలు, కుటుంబ కథా చిత్రాలు, విభిన్నమైన కథలు వంటి సినిమాలతో కళాతపస్వి తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారు. కాగా ఆయన దర్శకత్వం వహించిన స్వాతిముత్యం 1985 మార్చి 27న విడుదలయ్యింది. ఈ సినిమా ఆస్కార్‌కి నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా, రాధిక హీరోయిన్‌గా నటించారు. నిర్మలమ్మ, శరత్ బాబు కీలక పాత్రలు పోషించారు. అప్పటి వరకు మూస పద్ధతిలో వెళ్తున్న తెలుగు సినిమాలకు విశ్వనాథ్ కొత్త దిశను చూపారు. తెలుగు సంస్కృతిని చాటేందుకు సినిమాలను ఆయన వేదిక చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి : K. Viswanath :కళాతపస్వీ కె. విశ్వనాథ్ సినీ ప్రయాణం మొదలైంది ఇలానే?

Advertisement

Next Story

Most Viewed