ఆ డైరెక్టర్‌తో పనిచేయాలంటే నాకు దడ పుడుతుంది.. బాలీవుడ్ నటి

by sudharani |   ( Updated:2023-07-17 12:15:49.0  )
ఆ డైరెక్టర్‌తో పనిచేయాలంటే నాకు దడ పుడుతుంది.. బాలీవుడ్ నటి
X

దిశ, సినిమా : బీ టౌన్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ పనితీరుపై నటి రిచా చద్దా ప్రశంసలు కురిపించింది. రీసెంట్‌గా ఓ సమావేశంలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ అనుభవాలను పంచుకున్న ఆమె.. సంజయ్‌ లీలా సినిమాలో పనిచేయాలంటే మనసులో దడ పుడుతుందని చెప్పింది. ‘సెట్‌లో ఆయన ముందు షాట్‌ను అంత ఈజీగా కంప్లీట్ చేయడం కుదరదు. భన్సాలీ చాలా అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్నా దర్శకుడు. అందుకని ఏ సీన్ అయినా ఫర్‌ఫెక్ట్‌ వచ్చేదాకా నా మనసులో భయం భయంగా ఉండేది. ఎదుకంటే అతన్ని ఎవరూ మోసం చేయలేరు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ చిత్రనిర్మాతతో కలిసి పనిచేయడమంటే తనకు చాలా ఇష్టమని, పనిని సవాలు చేసే దర్శకుల సినిమాల్లో అవకాశం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తానని తెలిపింది.

Read More: Aishwarya Rajesh : స్విమ్ సూట్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్..

Advertisement

Next Story