- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పరిస్థితులు మళ్లీ రాకూడదనుకుంటున్నాను.. సమంత విడాకుల గురించే ఓపెన్ అయ్యిందా?
దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేశావే సినిమాతో, జెస్సీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి మొదటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మూవీ హిట్ కావడంతో, ఒక్కసారిగా సామ్‌కు ఆఫర్స్ రావడం, ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ఇక కెరీర్ ఎంత ఫాస్ట్‌గా టాప్ రేంజ్‌కు ఎదిగిపోయిందో, పర్సనల్ లైఫ్‌లో మాత్రం అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొందనే చెప్పాలి. చైతూతో వివాహం, విడాకులు, మయోసైటీస్, ఇలా ఊహించనివి ఎన్నో సామ్ ఎదుర్కొంది. చివరకు కొన్ని రోజుల పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చి ఇప్పుడిప్పుడే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది.
కాగా, తాజాగా సమంతకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. గడిచిన కాలం గురించి నేను ఎక్కువగా పట్టించుకోను, చీకటి రోజును అధిగమిస్తే మనం విజయం సాధిస్తాం. మళ్లీ అలాంటి రోజులు మాత్రం రాకూడదు అని కోరకుంటాను. నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాను. అన్ని విషయాల్లో దృఢంగా ఉండగలను అని తెలిపింది. దీంతో ఇది సామ్ డివోర్స్ గురించే ఇన్ డైరెక్ట్‌గా ఓపెన్ అయ్యింది అంటున్నారు పలువురు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.