Hanuman : ఓటీటీ ప్రమోషన్లకు రెడీ అయిన ‘హనుమాన్’ టీం..

by Kavitha |   ( Updated:2024-03-14 06:41:30.0  )
Hanuman : ఓటీటీ ప్రమోషన్లకు రెడీ అయిన ‘హనుమాన్’ టీం..
X

దిశ, సినిమా: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన మూవీ ‘హనుమాన్’. జనవరి 12న సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రం ఊహకందని స్థాయిలో రిలీజై భారీ వసూళ్లను దక్కించుకుంది. తెలుగుతో పాటు రిలీజైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. దీంతో మూవీ టీం అందరి తరపున ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. హిందీ వెర్షన్ ఓటీటీ డేట్ ఖరారైనా.. ఇతర భాషల విషయంలో ఇంకా సస్పెన్స్ లో ఉంది.

ఇక తాజాగా ‘హనుమాన్’ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్, టెలికాస్ట్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. కాగా ఈ మూవీ హిందీలో మార్చి 16 రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. అలాగే మార్చి 16నే హిందీలో జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రమంలో హిందీ వెర్షన్ ఓటీటీ కోసం ప్రమోషన్లను చేసేందుకు హీరో తేజ సజ్జా రెడీ అయ్యారు. ఇందు కోసం ముంబై చేరుకున్నారు తేజ సజ్జా. ఈ విషయాన్ని నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు. ‘సమ్‍థింగ్ ఫన్ రానుంది’ అంటూ పేర్కోన్నాడు. అఫీషియల్ జియో సినిమా అంటూ ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story