చీరకట్టులో మెరిసిన యాపిల్ బ్యూటీ.. యువతకు కిక్కిచ్చే పిక్స్ వైరల్

by Anjali |   ( Updated:2024-02-19 12:13:11.0  )
చీరకట్టులో మెరిసిన యాపిల్ బ్యూటీ.. యువతకు కిక్కిచ్చే పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: బాల నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ హన్సిక. తర్వాత అగ్ర హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుని తన నటనతో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. తాజాగా ఈ నటి డార్క్ చాక్లెట్ కలర్ శారీ కట్టుకుని డార్క్ చాక్లెట్ తరహాలో కుర్రాళ్ల మతిపోయేలా కిర్రాక్ ఫోజులిచ్చింది. మత్తుగా చూస్తూ, నడుము అందాలను ఆరబోస్తూ ఈ బ్యూటీ ఇచ్చిన స్టిల్స్ యువతకు ఫుల్ కిక్కిచ్చేలా ఉన్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న హన్సిక గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ‘ఏ ముహూర్తాన యాపిల్ బ్యూటీ అని పెట్టారో కానీ ఇప్పటికీ ఆ అందం అలాగే ఉంది’ టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసి యువత హృదయాల్లో కొలువైన హన్సిక బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక హన్సిక.. సోహైల్ అనే బిజినెస్‌మెన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సోహైల్ కు హన్సిక కంటే ముందే రింకీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడిపోయినట్లు సమాచారం. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే? హీరోయిన్ హన్సిక అండ్ రింకీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అట.

Advertisement

Next Story

Most Viewed